: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్యజిత్ రే చిత్రాల ప్రదర్శన
వెనిస్ చిత్రోత్సవంలో భారతీయ దర్శక దిగ్గజం సత్యజిత్ రే చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోని పురాతన చిత్రాలను ప్రదర్శించే ఈ చిత్రోత్సవంలో ఈసారి కొన్ని రే చిత్రాలను కూడా ప్రదర్శించబోతున్నారట. ఆగస్టు 28న ఈ చిత్రోత్సవం ప్రారంభంకానుంది. ఇందులో వెనిజులా క్లాసిక్ చిత్రాలతో పాటు ఇండియన్ మాస్టర్ సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 'మహాపురుష్','కాపురుష్' చిత్రాలను డిజిటల్లోకి మార్చిన తర్వాత ప్రదర్శించనున్నారు.