: 'జాతీయనేత' అంటూ ఎవరూ లేరు: శివసేన చీఫ్


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే ఎన్ డీఏ ప్రధానమంత్రి అభ్యర్ధని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మోడీకి వ్యతిరేకంగా ఎన్ డీఏ కీలక భాగస్వామి అయిన శివసేన పార్టీ వ్యతిరేక గళాన్ని వినిపిస్తోంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన అసోచామ్ సదస్సులో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. 2014 సాధారణ ఎన్నికలకు సరైన వ్యక్తినే ప్రధాని అభ్యర్ధిగా నిర్ణయిస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 'లీడర్ ఆఫ్ ద నేషన్' అని పిలవగలిగే నేత ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో ఎక్కడా మోడీ పేరును ప్రస్తావించని ఉద్ధవ్ పై విధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News