: కేబినెట్ భేటీకి హాజరు కావొద్దు: హరీశ్ రావు పిలుపు


తెలంగాణ మంత్రులెవరూ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావొద్దని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు పిలుపునిచ్చారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నామని ముఖ్యమంత్రి విస్పష్టంగా చెప్పిన తరువాత కూడా ఆయనను ఎందుకు ప్రశ్నించరంటూ వారిని హరీశ్ రావు నిలదీశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టీ మంత్రులు కిరణ్ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News