: చెన్నైలో అరెస్టైన గుంటూరు వాసులు


అమెరికా వీసా పొందేందుకు ఫోర్జరీకి పాల్పడిన ఘటనలో ఇద్దరు గుంటూరు జిల్లా వాసులు చెన్నైలో అరెస్టయ్యారు. వి.శివరామకృష్ణ, ఉపేంద్ర రెడ్డి అనే వ్యక్తులు అమెరికాకు చెందిన 'థియోరెమ్ క్లినికల్ రీసెర్చ్' కంపెనీ బెంగళూరు శాఖలో పనిచేస్తున్నట్లు పత్రాలు సృష్టించారు. వాటితో రెండు రోజుల కిందట (బుధవారం) చెన్నైలో వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. పరిశీలించిన అమెరికన్ కాన్సులేట్ జనరల్ అధికారులు పత్రాలు నకిలీవని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు పలు సెక్షన్ల కింద రిమాండుకు పంపారు.

  • Loading...

More Telugu News