: అనాదికాలంనుండి సేంద్రియ 'సాగు'


సేంద్రియ ఎరువుల వాడకం అనేది ఆధునిక కాలంలో వచ్చిందని, అనాదిగా మనుషులు కేవలం పోడు వ్యవసాయంతోనే జీవనాన్ని సాగించేవారని మనం ఇంతవరకూ భావించేవాళ్లం. అయితే ఐరోపాలో రైతులు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే సేంద్రియ ఎరువులను వాడారని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటి దాకా ఐరోపాలో ఎరువుల వాడకం అనేది కేవలం ఇనుపయుగం, రోమనుల కాలంలోనే మొదలైందని భావించేవారు. అంతకుముందు రైతులు కేవలం పోడు వ్యవసాయానికే పరిమితం అయ్యారని భావించేవారు. కానీ ఐరోపాలో కొత్త రాతియుగం నాటి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు అంతకుముందు వ్యవసాయంపై తమ భావన తప్పని చెబుతున్నారు. ఈ క్షేత్రాల్లో లభించిన బార్లీ, గోధుమ వంటి ధాన్యాల్లో 'నైట్రోజన్15' స్థాయి ఎక్కువగా ఉందని, ఇది సేంద్రియ ఎరువుల వాడకానికి సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం దీర్ఘకాలం పాటు వ్యవసాయానికి హేతువు. అంటే అప్పట్లో పంట భూమిని ఆస్తిగా భావించేవాళ్లని తెలుస్తోంది. దీన్ని బట్టి అప్పట్లో ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే సామాజిక వర్గ విభజన కూడా ఉండేదని ఈ పరిశోధన చేసిన డాక్టర్‌ ఎమీ బొగార్డ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News