: పూరీ జగన్నాథ్ తల్లి సర్పంచ్ గా ఏకగ్రీవం


విశాఖ జిల్లా బాపిరాజు కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాధ్ తల్లి పెట్ల సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ ఏర్పడిన నాటినుంచి పెట్లవారి కుటుంబ సభ్యులే ఎన్నికవడం ఆనవాయతీగా వస్తోంది. ఈసారి ఈ గ్రామం మహిళలకు రిజర్వు కావడంతో పూరీ తల్లి సర్పంచ్ గా బరిలో నిలిచారు. ప్రత్యర్ధి వర్గం నుంచి నిలుచున్న మరో మహిళ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆమె ఎన్నిక లాంఛనమైంది.

ఈ కుటుంబానికి చెందిన పెట్ల బెన్నయ్య నాయుడు 55 ఏళ్ల క్రితం సర్పంచ్ గా ఎన్నికై 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా కొనసాగాడు. ఆ తర్వాత గ్రామంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అవి కూడా పెట్లవారివే కావడం విశేషం. 1995లో పెట్ల ఉమా శంకర్ గణేష్ సర్పంచ్ గా గెలిచారు. ఈయన స్వయాన దర్శకుడు పూరీకి తమ్ముడు.

ఒకానొక సమయంలో పూరీ తండ్రి సింహాచలం నాయుడు ఉప సర్పంచ్ గా ఉన్నారు. అంతకుముందు పూరీ తండ్రి ఈ గ్రామానికి రెవిన్యూ అధికారిగా పని చేశారు. ఆయన పదవీ విరమణ తర్వాత ఈ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆ కుటుంబం గ్రామాన్ని అభివృద్ధి చేయడం వల్లే మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్థానికులు చెప్పారు.

  • Loading...

More Telugu News