: తమిళనాడులో ఉత్తుత్తి న్యాయస్థానం!


ఎక్కడైనా, వస్తువులకు నకిలీలను చూస్తుంటాం. కానీ, తమిళనాడులో న్యాయానికీ నకిలీ మకిలి అంటించాడో న్యాయవాది. వివరాల్లోకెళితే.. కేఆర్ షణ్ముగం కోయంబత్తూరులో ఓ న్యాయవాది. కేసులు వాదించుకుంటూ పోతే ఎంత సంపాదించగలం అని భావించినట్టున్నాడు.. ఓ కొత్త ఐడియాను ఆచరణలో పెట్టాడు. ఏకంగా కోర్టుకు ప్రతిసృష్టికి చేశాడు. ఓ నకిలీ న్యాయస్థానాన్ని రూపొందించి,తాను జడ్జి అవతామెత్తాడు. కేసులను అసలైన కోర్టుల వరకు వెళ్ళనీయకుండా, తన నకిలీ న్యాయస్థానం వద్దే వాటిని సెటిల్ చేస్తూ బాగానే వెనకేసుకున్నాడు. ఇలా ఐదేళ్ళపాటు నిరాటంకంగా సాగింది. కానీ, ఓ వ్యక్తికి అనుమానం రావడంతో షణ్ముగం గుట్టురట్టయింది.

ఇద్దరు వ్యక్తుల మధ్య రేగిన భూవివాదంలో వేలుపెట్టిన షణ్ముగం.. వారిలో ఓ వ్యక్తికి కోర్టుకు హాజరవ్వాలంటూ లేఖ రాశాడు. కోర్టు తనకు ఆదేశాలు జారీ చేసిందని నమ్మిన ఆ వ్యక్తి తన కుమారుడితో కలిసి నకిలీ న్యాయస్థానానికి హాజరయ్యాడు. ఇక విచారణ తంతు ఆరంభించిన షణ్ముగం .. విచారణను వాయిదా వేస్తున్నామని, కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టాలని ఆ తండ్రీకొడుకులను ఆదేశించాడు. వారు నిరాకరించడంతో కొందరు వ్యక్తులు వారితో బలవంతంగా సంతకాలు పెట్టించారు. వీళ్ళ వ్యవహారం చూస్తే తేడాగా ఉండడంతో ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, పోలీసులు షణ్ముగాన్ని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News