: పతనమైన బంగారం ధరలు


అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితులతో బాటు, డాలర్ ఇండెక్స్ 81కి చేరడం బంగారానికి ప్రతికూల అంశాలుగా మారాయి. దాంతో జాతీయ మార్కెట్ లో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. ఒక్కసారే ఏడున్నర నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,160 ఉంది.

అదే గరిష్ఠ స్థాయి నుంచి చూసుకుంటే, బంగారం రేటు దాదాపు 4వేల రూపాయలు తగ్గింది. దీని ఫలితంగా ఔన్స్ బంగారం ధర 1600 డాలర్ల దిగువకు చేరింది. గడచిన సంవత్సర కాలంలో రేటు ఎప్పుడూ ఇంత స్థాయిలో పతనమవలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రభావంతో మరోవైపు వెండి ధర కూడా తగ్గి కిలో 54,200 వద్ద ఉంది.
 

  • Loading...

More Telugu News