: సోనియాను టార్గెట్ చేస్తున్న బాబా రాందేవ్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఓడించడానికి శక్తి వంచన లేకుండా కష్టపడతానని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ప్రతినబూనారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ సోనియాను ఓడించేందుకు తాను స్వయంగా రాయ్ బరేలీ వెళ్లి ప్రచారం చేస్తానన్నారు. ధగ్గరుండి మరీ సోనియాను ఓడిస్తాననని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి దశ, దిశ రెండూ లేవని అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ సంక్షోభం వచ్చినా, ఆయన కనపడకుండా మాయమైపోతారని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత యూపీఏ అంతటి అవినీతి ప్రభుత్వం మరొకటి లేదని విమర్శించారు. ఆంగ్లేయులకన్నా కాంగ్రెస్ వారే ఎక్కువ దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ మ్యానిఫెస్టో చూసిన తరువాత మద్దతుపై సమాధానమిస్తానన్నారు. మోడీకి తన మద్దతు కొనసాగుతుందని రాందేవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.