: ఏకగ్రీవ పంచాయతీలపై ఎన్నికల నిఘా వేదిక అనుమానం


రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సుమారు 2300 పంచాయతీలపై అనుమానాలు రేకెత్తుతున్నాయని ఎన్నికల నిఘా వేదిక పేర్కొంది. రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచేసినట్లు సమాచారముందని, దీనిపై విచారణ చేపట్టాలని నిఘా ప్రతినిధులు జస్టిస్ అంబటి లక్ష్మణరావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలను పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఏకగ్రీవం చేశారంటూ ఆరోపించారు. బెల్టు షాపులు ఎత్తివేయాలని, మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా ఇప్పటివరకూ ఏ చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా, అవినీతిపరులను, నేరస్తులను ఓడించాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News