: నీట్ పై సుప్రీంకోర్టు తీర్పును సమర్ధించిన మంత్రి కొండ్రు


నీట్ పరీక్షపై దేశ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి సమర్ధించారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు హర్షణీయమన్నారు. వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేస్తూ సుప్రీం ఈ ఉదయం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. యధావిధిగానే ఎంసెట్ పరీక్ష నిర్వహించుకోవచ్చని చెప్పింది.

ఈ పరీక్ష కోసం ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)జారీ చేసిన నోటిఫికేన్ చట్ట విరుద్ధమని ప్రకటించింది. రాష్ట్రానికి సంబంధించి ఎంసెట్ ద్వారానే ప్రవేశాలు నిర్వహించేందుకు సుప్రీం తీర్పుతో మార్గం సుగమమైంది. కాగా, ముగ్గురు సభ్యుల బెంచ్ లో ఒకరు ఈ తీర్పును వ్యతిరేకించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆల్తమస్ కబీర్, జస్టిస్ విక్రమ్ జిత్ సేన్ నీట్ ను కొట్టి వేయాలని చెప్పగా... బెంచ్ లోని మరో సభ్యుడు జస్టిస్ అనిల్ దవే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ చట్టబద్ధమేనని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News