: ఆసియన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడానికి జయలలిత విముఖత
వచ్చే జూలై నెలలో జరగాల్సిన ఆసియన్ అథ్లెటిక్స్ పోటీలను తమిళనాడులో నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత విముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు జయ చెన్నైలో ఓ ప్రకటన చేశారు. ఈ పోటీల్లో శ్రీలంక పాల్గొంటే తమిళుల మనోభావాలు దెబ్బతింటాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనకుండా శ్రీలంకపై నిషేధం విధించాలని జయలలిత కేంద్రాన్ని కోరారనీ, అయితే కేంద్రం స్పందించకపోవడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
1989లో న్యూఢిల్లీలో జరిగిన ఈ క్రీడలు అనంతరం 20 సంవత్సరాల తర్వాత మళ్లీ చెన్నైలో జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఎల్టీటీఈ అధినేత వేలు పిళ్లై ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ను చిన్న పిల్లవాడని కూడా చూడకుండా దారుణంగా చంపిన నేపథ్యంలో కొన్ని ఫోటోలు బయటకి రావడం... దీనిపై బుధవారం జయ తీవ్రంగా స్పందించడం తెలిసిన విషయమే!