: ఈ కారుకు డ్రైవర్‌ అక్కర్లేదు


మీరు కారుకు డ్రైవర్‌ను పెట్టుకోవాలనుకుంటున్నారా... అయితే మీరు ఇలాంటి కారు కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఈ కారుకు డ్రైవర్‌ అవసరం ఉండదు. వాటంతట అవే రోడ్లపై చక్కగా తిరిగేస్తాయి. ఎందుకంటే, డ్రైవర్‌ అవసరం లేని విధంగా వాటిని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు రూపొందించారు.

దీనికి అటు బ్రిటన్‌ ప్రభుత్వ రవాణా శాఖ కూడా అనుమతులను మంజూరు చేసింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఈ కారు రూపకర్తలు జపాన్‌కు చెందిన వాహన సంస్థ నిస్సాన్‌తో కలిసి, తాము తయారుచేసిన కారుకు పూర్తి రూపం తెచ్చేందుకు తీవ్ర కృషి చేశారు. ఈ కార్లను ఇప్పటికే నిర్జన ప్రాంతాల్లో రోడ్లపై పరీక్షించిన పరిశోధకులు, వాటిని మరింతగా అభివృద్ధిపరచి, మరింతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి లండన్‌లోని రద్దీ రహదారులపై కూడా నడపాలని ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ కార్లను లండన్‌లోని రద్దీ రోడ్లపై కూడా ప్రయోగాత్మకంగా నడిపే అవకాశముందని భావిస్తున్నారు. డ్రైవర్‌ అవసరం లేని ఈ కార్లు కెమెరాలు, రాడార్లు, లేజర్‌ సెన్సర్ల సహాయంతో రహదారులపై దూసుకెళతాయని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News