: సీబీఐకి సుప్రీంకోర్టు వార్నింగ్


'కోల్ గేట్' కుంభకోణం వ్యవహారంలో దర్యాప్తు సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకోవద్దని సీబీఐని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రతి విషయాన్ని కేంద్రంతో పంచుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. 'మీరు పెట్టుకున్న దరఖాస్తు ప్రకారం సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకుంటే ఒకరి నుంచి మరొకరికి ఇచ్చినట్లు అవుతుంది' అని పేర్కొంది. ఒకవేళ దర్యాప్తులో ఏవైనా అడ్డంకులు, అవరోధాలు ఏర్పడితే తమను సంప్రదించాలని చెప్పింది. వాస్తవాన్ని అన్వేషించే క్రమంలో దేన్నీ వదిలిపెట్టవద్దని సీబీఐకి సూచించింది. 'కోల్ గేట్' దర్యాప్తు వ్యవహారంలో కొంత సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకునేందుకు అనుమతి కావాలంటూ కొన్ని రోజుల కిందట సీబీఐ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దరఖాస్తు పెట్టుకుంది. దీనిపై కోర్టు పైవిధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News