: పేకాడుతూ దొరికిపోయిన సీఐడీ ఇన్ స్పెక్టర్
పేకాటరాయుళ్ళను పట్టుకునేందుకు వెళ్ళిన హైదరాబాదులోని హుమాయూన్ నగర్ పోలీసులు అక్కడ ఓ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. పేకాడుతున్న వారిలో ఓ సీఐడీ ఇన్ స్పెక్టర్ ఉండడమే అందుకు కారణం! సదరు ఇన్ స్పెక్టర్ పేరు పూర్ణచందర్. అతగాడితోపాటు మరో 12 మంది పేకాటరాయుళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ.64 వేలు స్వాధీనం చేసుకున్నారు.