: మధ్యప్రదేశ్ వైపు మరలిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్యప్రదేశ్ వైపు తరలుతోంది. ఇది ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లను ఆనుకుని స్ధిరంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంమీద నెమ్మదిగా తగ్గుతోందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. కాగా, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో సముద్రతీరం వెంట గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేటకు వెళ్లకుంటే మరింత మంచిదని సలహా ఇచ్చింది.