: డాన్స్ బార్లను అనుమతించం: మహారాష్ట్ర
డాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు తొలగించినప్పటికీ.. అక్కడి ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. దీనిపై న్యాయ సలహా తీసుకుని, డాన్స్ బార్లను ఇక ముందూ తెరవకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ తెలిపారు. ఇందుకోసం ఉభయ సభల సభ్యులతో కమిటీ వేశామని చెప్పారు.