: 'గంటి ప్రసాదం పేరిట పుస్తకం రాస్తే చంపేస్తాం'


గంటి ప్రసాదం పేరిట పుస్తకాలు రాస్తే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తామని హెచ్చరిస్తూ 'విరసం' రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి ఇంటికి లేఖ వచ్చింది. చత్తీస్ గఢ్ చిరుతల పేరిట వచ్చిన ఈ లేఖలో 'విరసం' నేతలను చంపేస్తామని హెచ్చరించారు. తమ ఆజ్ఞను ధిక్కరిస్తే 'విరసం' నేతల ఇళ్లపై తూటాల వర్షం కురిపిస్తామన్నారు. ప్రధానంగా ఈ హెచ్చరికలు వరవరరావు, చలసాని ప్రసాద్, ప్రొఫెసర్ హరగోపాల్ లకు చేశారు. ఈ హెచ్చరికలు ప్రభుత్వానివేనని 'విరసం' నేతలు ఆరోపిస్తున్నారు. అమరవీరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంటి ప్రసాదం హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని 'విరసం' నేతలు ముందు నుంచీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News