: ప్రశాంతంగా ఉన్న కోనసీమపై ఉగ్రవాదుల కన్ను?


పచ్చని పంటపొలాలకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన కోనసీమపై ఉగ్రవాదుల కన్ను పడింది. ఈమేరకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో, ఎప్పుడు ఏ ముప్పు, ఏ రూపంలో వచ్చిపడుతుందోననే బెంగ అధికారుల్లో గుబులు రేపుతోంది. అన్నపూర్ణగా అలరారుతున్న గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసేందుకు ముష్కరులు వ్యూహాలు రచిస్తున్నారు. చమురు సంపదతో అలరారే కేజీ బేసిన్ లో బాంబుపేలుళ్లకు పాల్పడి దేశ సంపదకు తీరని నష్టం చేకూర్చి, కోలుకోలేకుండా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

బుద్దగయ పేలుళ్ల తరువాత ఉగ్రవాదులు వారి లక్ష్యాలను మార్చుకున్నారని, మత కల్లోలాల కంటే సంపదకు నష్టం చేకూరిస్తే మరింత తీవ్ర నష్టం కలుగుతుందని అనుకుంటున్నట్టు పసిగట్టారు. తక్షణం రెండు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఏక్షణంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మెరైన్ పోలీసులకు సూచించారు. తీర ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు. ఉగ్రముప్పు ప్రధానంగా కాకినాడకు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News