: కేదార్ నాథ్ ఆలయానికి బీటలు


ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్ నాథ్ ఆలయం ఇటీవల వచ్చిన వరదలకు బీటలువారినట్టు తెలిసింది. తీవ్రస్థాయిలో వరదలు, కొండచరియలు విరిగిపడ్డా ఆలయ నిర్మాణం చెక్కుచెదరలేదని ఇప్పటి వరకూ అందరూ భావించారు. కానీ, భారత పురావస్తు శాఖ ఇంజనీరింగ్ నిపుణులు కేదార్ నాథ్ ఆలయాన్ని పరిశీలించగా, అక్కడక్కడా బీటలు వారినట్లు గుర్తించారు. అయితే, గర్భగుడికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఉన్నతాధికారులకు నివేదించారు. కేదార్ నాథ్ ఆలయ పునరుద్ధరణ బాధ్యతను ఉత్తరాఖండ్ ప్రభుత్వం పురావస్తు శాఖకు అప్పగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News