: ఈ నెల 22 నుంచి ఆన్ లైన్ మెడికల్ కౌన్సెలింగ్
ఈనెల 22 నుంచి ఆన్ లైన్ మెడికల్ కౌన్సెలింగ్ జరగనుందని అధికారులు తెలిపారు. దాంతో, ఎంసెట్ పరీక్ష నిర్వహించిన చాలా రోజుల తర్వాత కౌన్సెలింగ్ ప్రారంభం కాబోతుండటంతో విద్యార్ధులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఆన్ లైన్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య విద్య సీట్ల కేటాయింపులో అమరులైన పోలీసుల పిల్లలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తుండటమే ఈసారి ప్రత్యేకత. అటు మెడికల్ పీజీ సీట్లకు సంబంధించి ఈనెల 23 నుంచి రెండో దఫా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది.