: ఐఐటీ ప్రొఫెసర్ల నిరాహార దీక్ష
ఖరగ్ పూర్ ఐఐటీ ప్రొఫెసర్లు నిరాహార దీక్ష చేపట్టారు. ఐఐటీ డైరెక్టర్ గా డీపీ చక్రవర్తికి తక్షణమే బాధ్యతలు అప్పగించాలంటూ 425 మంది ప్రొఫెసర్లు నిరాహార దీక్షకు దిగారు. ఏడాది కాలంగా ఈ ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఇన్ చార్జి డైరెక్టర్ పర్యవేక్షణలోనే నడుస్తోంది. విద్యావేత్త డీపీ చక్రవర్తిని ఏడాది క్రితమే డైరెక్టర్ గా నియమించినా, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆయనకు ఇప్పటివరకూ బాధ్యతలు స్వీకరించే అవకాశం కల్పించలేదు. దీంతో తమ ఐఐటీ డైరెక్టర్ కు తక్షణం విధుల్లో చేరే అవకాశం కల్పించాలని ప్రొఫెసర్లంతా నిరాహార దీక్షకు దిగారు.