: విశాఖ సాగరతీరాన 'వివేక్ నడక'


ఈ రోజు ఉదయమే విశాఖపట్నం సాగరతీరం యువకులు, విద్యార్ధులతో నిండిపోయింది. తిథుల ప్రకారం నేడు స్వామి వివేకానంద జన్మదినం. దీనిని పురస్కరించుకుని, విశాఖ రామకృష్ణా బీచ్ వద్ద 'వివేక్ నడక' పేరిట ఈ ఉదయం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 20 న జరిగే రథయాత్రకు సన్నాహకంగా ఈ కార్యక్రమాన్ని చేబట్టారు. వేలాది మంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివేకానంద సూక్తులతో కూడిన 150 అడుగుల బ్యానర్ ఈ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకుంది. దీనిని శ్రీప్రకాశ్ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఆకర్షణీయంగా రూపొందించారు. రామకృష్ణా మిషన్ కు చెందిన గణేశ్ మిలన్ ఈ సందర్భంగా ప్రసంగించారు.

  • Loading...

More Telugu News