: ఢిల్లీలో పొగమంచుతో విమాన సర్వీసులు ఆలస్యం
న్యూఢిల్లీ నగరాన్ని ఈ ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. దీని కారణంగా
ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర
అంతరాయం ఏర్పడింది. పొగమంచులో రన్ వే కనిపించకపోవడంతో పలు విమానానాలు
ఆలస్యంగా నడుస్తుండగా, ఏడు అంతర్జాతీయ, 17 డొమెస్టిక్ విమానాలు
సర్వీసులను నిలిపివేసినట్లు సమాచారం. కాగా, ఢిల్లీకి రావలసిన పలు విమాన
సర్వీసులను ఇతర నగరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.