: వాన ఎఫెక్ట్.. వంద గ్రామాలకు రాకపోకలు బంద్
ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వంద గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం టోంకిని-తాటిచెట్టు ఒర్రె వంతెనపై నుంచి పెన్ గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో, కౌతాల, బెజ్జూరు, సిర్పూర్ (టి) మండలాల్లోని దాదాపు వంద గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.