: 99 పిస్తోళ్లు స్వాధీనం... పెరుగుతున్న గన్ కల్చర్
దేశంలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతోంది. నిన్న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో 66 నాటు తుపాకులు లభ్యమై సంచలనం సృష్టిస్తే, తాజాగా ఢిల్లీ పోలీసు తనిఖీల్లో 99 తుపాకులు పట్టుబడిన ఘటన మరింత కలకలం రేపింది. సోనియా విహార్ లో ఇద్దరు బీహారీలు ప్రయాణిస్తున్న కారు నుంచి ఈ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి నిషిద్ధ 0.32 సైజ్ బోర్ రకానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. వాటిని బీహార్లో తయారు చేసినట్టు, మాఫియా ముఠాలకు అందజేసేందుకు తరలిస్తున్నట్టు నిందితులు తెలిపారు. వీటిని తెలివిగా, కారు ముందు భాగంలోని హైడ్ లైట్ల దగ్గర జాగ్రత్తగా దాచి స్మగ్లింగ్ కు పాల్పడుతునట్టు పోలీసులు చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గన్ కల్చర్ ఏ రీతిలో పెరిగిపోతోందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.