: కాంగ్రెస్ సర్కారు కొనసాగడానికి బాబే కారణం: షర్మిల
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొనసాగడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల ఆరోపిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా బాబు.. కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. విజయనగరం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల.. గజపతినగరం నియోజకవర్గంలోని కోమటిపల్లి వద్ద ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబుపైనా, కాంగ్రెస్ సర్కారుపైనా విమర్శలు గుప్పించారు. ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తూ ఉన్న పథకాల్లో కోతలు పెడుతున్నారని షర్మిల ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించి జగన్ ను జైలుకు పంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే నిర్దోషిగా బయటికొస్తాడని ధీమా వ్యక్తం చేశారు.