: ఎస్సైపై దాడిచేసి గాయపరిచిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు


కడప జిల్లా లింగాల మండలం అంబకపల్లిలో ఎస్సై రమేష్ బాబుపై గ్రామస్తులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపర్చారు. దీంతో ఆయనను పులివెందుల ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగి ఓ వ్యక్తి చనిపోయాడన్న సమాచారంతో అంబకపల్లి వెళ్లిన ఎస్సైతో స్థానిక వైఎస్సార్సీపీ నేత మురళీనాథ్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్తులు ఆయనపై దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న ఎస్సై రమేష్ బాబును జిల్లా ఎస్పీ మనీష్ పరామర్శిచారు.

  • Loading...

More Telugu News