: ఈ నెల 25న హైదరాబాదులో జేఏసీ మహాధర్నా
ఈ నెల 25న హైదరాబాదులో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ కోదండరాం తెలిపారు. 'ఒక జిల్లా ఎక్కువగా వద్దు, మరో జిల్లా తక్కువా వద్దు.. మా తెలంగాణ మాకు ఇవ్వండి' అనే డిమాండుతో ఈ ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. అంతేగాక, 'సాగదీస్తే.. సాగనంపుతాం' అనే మరో నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో చైతన్య యాత్రలు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రం విషయంలో తమ ఓపికను పరీక్షించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.