: బాల్యమిత్రుడిని ఆదుకున్న ధోనీ


ఎంత ఎదిగినా టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం చిన్ననాటి మిత్రులను మరువలేదనడానికి ఇదిగో సాక్ష్యం. అతని మనసు వెన్న అని చెప్పేందుకూ ఇదే నిదర్శనం. విషయం ఏంటంటారా.. హెలికాప్టర్ షాట్ కు ఆద్యుడు, ధోనీకి బాల్యమిత్రుడు సంతోష్ లాల్ కు ఇటీవలే అక్యూట్ పాంక్రియాటైటిస్ వ్యాధి నిర్ధారణ అయింది. రంజీ క్రీడాకారుడైన సంతోష్ ఆర్ధికభారంతో వ్యాధి ముదిరినా గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు.

దీంతో, విషయం ధోనీకి తెలియడంతో సోమవారం హుటాహుటీన ఎయిర్ అంబులెన్స్ (విమానం)లో ఢిల్లీ తరలించాడు తన చిన్ననాటి మిత్రుడిని. రాంచీలో సృహలేని స్థితిలో మిత్రుణ్ణి చూసేసరికి ధోనీ చలించిపోయాడని జార్ఖండ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా, రంజీల్లో ధోనీ, సంతోష్ జార్ఖండ్ కు ప్రాతినిధ్యం వహించారు. కాగా, తాను అప్పుడప్పుడూ ప్రదర్శించే హెలికాప్టర్ షాట్ ను సంతోష్ దగ్గరే నేర్చుకున్నానని ధోనీ పలుమార్లు చెప్పాడు కూడా.

  • Loading...

More Telugu News