: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు పెరిగారు


ఉన్నత విద్యనభ్యసించే భారతీయ విద్యార్ధుల సంఖ్య తమ దేశంలో గణనీయంగా పెరిగిందని మెల్ బోర్న్ లోని ఓ సంస్థ వెల్లడించింది. తాము నిర్వహించిన సర్వే ప్రకారం ఇమ్మిగ్రేషన్ విధానం లోని మార్పులవల్ల ఉన్నత విద్యనభ్యసించేందుకు భారతీయులు అధిక సంఖ్యలో వచ్చారని తెలిపింది. వీరిలో ఐటీ సంబంధిత కోర్సులు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించింది. దాని తరువాత క్రోకరీ, హెయిర్ డ్రెస్సింగ్ కోర్సుల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారని వెల్లడించింది. ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా, 'దేర్ ప్యాట్రన్స్ అండ్ మోటివేషన్స్' పేరిట జరిపిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూసినట్టు 'ఆస్ట్రేలియన్ జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషన్' కథనం ప్రచురించింది.

  • Loading...

More Telugu News