: చిత్తూరు జిల్లాలో 60 నాటు తుపాకులు స్వాధీనం


విష సంస్కృతి స్వైరవిహారం చేస్తూ మనుషుల్ని క్రూరులుగా మారుస్తోంది. వర్గపోరులో తడిసి ముద్దయ్యే రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ ఛాయలు ఇంకా తుడిచిపెట్టుకుపోలేదని, నివురుగప్పిన నిప్పులా ఉందనడానికి సాక్ష్యం.. అక్కడ దొరుకుతున్న కత్తులు, కటార్లు, హత్యలు, గొడవలే. కాగా, తాజాగా కత్తుల్ని వదిలేసి తుపాకుల వైపు మళ్లారు ఫ్యాక్షన్ రారాజులు. అందుకు చిత్తూరు జిల్లాలో దొరికిన నాటుతుపాకులే నిదర్శనం. వర్గపోరు రాజ్యమేలే రాయలసీమ జిల్లా చిత్తూరులో పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు, పాకాల, పూతలపట్టు, కల్లూరు, పెనుమూరు మండలాల్లో అనుమతి లేని 60 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 40 లీటర్ల కాపు సారా పట్టుకుని 471 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News