: ప్రైవేటు వైద్య కళాశాలలకు హైకోర్టు ఆదేశం
ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీచేసి, దరఖాస్తులు ఇవ్వని కొన్ని ప్రైవేటు కళాశాలలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీ1 కేటగిరి సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు జారీచేసి వాటిని తక్షణమే స్వీకరించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు ఇవ్వకుండా ఉన్న కొన్ని కళాశాలల వైఖరిని ఛాలెంజ్ చేస్తూ కొన్నిరోజుల కిందట కొందరు విద్యార్ధులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. ఈ మేరకు కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎల్ బీనగర్, నార్కట్ పల్లిలోని కామినేని వైద్య కళాశాలలతో పాటు మరికొన్ని కళాశాలలకు నోటీసులు జారీచేసింది.