: ఆ ఊరికి ఈ రోజే కరెంటు వచ్చింది!
65 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఓ కుగ్రామం తొలిసారిగా ఈ రోజు విద్యుత్ వెలుగులను వీక్షించింది. స్వతంత్ర భారతావనిలో గ్రామస్వరాజ్యం దుస్థితికి అద్దంపట్టే ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో చోటుచేసుకుంది. గడ్చిరోలి అటవీ ప్రాంతంలో ఎన్నో మారుమూల గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. విద్యుత్ కాంతిని చూసిన ఈ గ్రామం పుణ్యం చేసుకుందని, ఇంతకంటే తీవ్ర సౌకర్యాల లేమితో మరిన్ని గ్రామాలు మగ్గిపోతున్నాయని గడ్చిరోలి గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.