: బిచ్చమెత్తుకుంటున్న 'సర్పంచ్'!


రాజకీయాలంటే డబ్బు సంపాదించుకోవడానికి సరైన దారని మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వార్డు మెంబరుగా అవకాశం వస్తే చాలు, ఫుల్లుగా సంపాదించుకోవచ్చని భావిస్తున్న రోజులివి. ప్రస్తుత కాలంలో టార్చ్ వేసి వెతికినా రాజకీయాల్లో నీతిమంతులు కనిపించరని అందరూ ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు! అలాంటిది తన గ్రామానికి రెండుసార్లు సర్పంచ్ గా పనిచేసి.. ఆస్తిపాస్తులన్నీ గ్రామ పురోగతి కోసమే ధారపోశాడో ఉత్తముడు. నేడు అన్నీ కోల్పోయి, బిచ్చమెత్తుకుని పొట్ట నింపుకుంటున్నాడు ఆ డెభ్భై ఏళ్ల వృద్ధుడు.

వివరాల్లోకెళితే.. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం వందలపల్లి గ్రామానికి వెంకటయ్య అనే వ్యక్తి పదేళ్లపాటు సర్పంచ్ గా పని చేశాడు. వచ్చిన నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. చివరికి సొంత ఇంటిని కూడా అమ్మి తన హయాంలోనే గ్రామ పంచాయతీకి భవనం కట్టించాడు. అన్నేళ్లలో తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా నిత్యం కష్టపడ్డాడు. తత్ఫలితం.. ఈరోజు రోడ్డున పడ్డాడు. కొన్నాళ్ల పాటు ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛనుతో ఎలాగోలా బతికాడు. రెండు సంవత్సరాల నుంచి అది కూడా రాకపోవడంతో ఇల్లిల్లూ తిరిగి అడుక్కుని తింటున్నాడు.

నిలువ నీడ లేకపోవడంతో ఆయన కట్టించిన గ్రామ పంచాయతీనే నీడనిస్తోంది. ఆ భవనంలోనే ఉంటూ బతుకును వెళ్లదీస్తున్నాడు వెంకటయ్య. గ్రామానికి అంత చేసినా ఆయనను గ్రామంలోని సంపన్నవర్గాలు గానీ, ప్రభుత్వం గానీ ఏమాత్రం ఆదుకోవడంలేదని గ్రామస్థులు అంటున్నారు.

  • Loading...

More Telugu News