: ఒకే ఒక్కడు!


పాకిస్తాన్ డాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 350 వికెట్లు, 7000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా అవతరించాడు. విండీస్ తో సిరీస్ లో తొలి వన్డే సందర్భంగా డ్వేన్ బ్రావో వికెట్ తీయడంతో అఫ్రీది ఖాతాలో 350వ వికెట్ చేరింది. ఆ పోరులో అఫ్రిది ఏడు వికెట్లతో విండీస్ ను హడలెత్తించాడు. అఫ్రిది ధాటికి ఆతిథ్య జట్టు 98 పరుగులకే కుప్పకూలింది. అదే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్రిది 76 పరుగులు చేసి పాక్ కు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. కాగా, వన్డేల్లో అత్యధిక వికెట్లు, పరుగులు సాధించిన వారిలో అఫ్రిది తర్వాతి స్థానంలో శ్రీలంక మాజీ సారథి సనత్ జయసూర్య (323 వికెట్లు, 13430 పరుగులు) ఉన్నాడు.

  • Loading...

More Telugu News