: బెంగాల్ లో కేంద్ర మంత్రిపై కాల్పులు
పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల చిచ్చు రగులుతూనే ఉంది. మూడో దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎ.హెచ్. ఖాన్ చౌదరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాగా, అగంతకుల కాల్పుల నుంచి మంత్రి త్రుటిలో తప్పించుకున్నారు. నిన్న జరిగిన రెండో దశ ఎన్నికల్లో చెలరేగిన హింసలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.