: హైదరాబాద్ పరిస్థితి ఏంటి?: మజ్లిస్ నేతల్లో సందేహం


కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో చర్చించిన వివరాలు తెలుసుకునేందుకు నేడు మజ్లిస్ నేతలు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేస్తే హైదరాబాద్ పరిస్థితి ఏమిటని వారు ఆయనను అడిగినట్టు తెలుస్తోంది. ఈనెల 12 హస్తినలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ భేటీ సందర్భంగా కాంగ్రెస్ నేతలు సమర్పించిన రోడ్ మ్యాప్ లు, వారి అభిప్రాయాల గురించి మజ్లిస్ ఎమ్మెల్యేలు రాజనర్సింహతో చర్చించారు. డిప్యూటీ సీఎంను నేడు హైదరాబాద్ లో కలిసిన వారిలో అక్బరుద్దీన్ సహా పలువురు శాసనసభ్యులున్నారు.

  • Loading...

More Telugu News