: బీహార్ లో మరోసారి బాంబు పేలుళ్లు
బుద్ధగయ పేలుళ్లను మరచిపోక ముందే మరోసారి బీహార్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. హాజీపూర్ జిల్లా వైశాలి కోర్టుల సముదాయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో కోర్టు ప్రాంగణంలో కక్షిదారులు, న్యాయవాదులు, స్థానికులు కకావికలయ్యారు. పేలకుండా ఉన్న ఒక బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. బాంబు పేలుళ్లలో గాయపడ్డవారి వివరాలపై ఇంకా సమాచారం లేదు. బాంబు పేలుళ్ల వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.