: చైనాలో వరద బీభత్సం
చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. దీంతో చైనాలో గ్వాంగ్ డంగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా చోట్ల వరద తీవ్రతకు రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో గ్రామాల్లో విద్యుత్, సమాచార వ్యవస్థ కుప్పకూలింది. చాలా చోట్ల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వందలాది గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదల ధాటికి చాలా మంది మరణించి ఉంటారని, పూర్తి వివరాలు అందాల్సివుందని అధికారులు చెబుతున్నారు.