: ముంబైలో డ్యాన్స్ బార్లకు సుప్రీం ఓకే
ముంబైలో డాన్స్ బార్లు తిరిగి ప్రారంభించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో అక్కడి బార్లు మళ్లీ అతివల నృత్యాలతో హోరెత్తనున్నాయి. సుప్రీం తాజా తీర్పు మందుబాబులకు పరవశం కలిగించేదే. ముంబైలోని బార్లలో డ్యాన్సులపై 2005లో అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, 2006లో బోంబే హైకోర్టు నిషేధాన్ని తొలగించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో సుప్రీంకోర్టు బార్లలో డాన్సులపై మధ్యంతర స్టే జారీ చేసింది. ఇప్పుడు దానిని ఉపసంహరిస్తూ, బోంబే హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ తాజా తీర్పు వెలువరించింది.