: బంగాళఖాతంలో మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో వాయువ్యదిశగా మరో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా నుంచి కోస్తాంధ్ర తీరాల మధ్య ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అయితే, తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంటోంది. ముఖ్యంగా జాలర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.