: పరుగుల రాజుల పరువు పాయె!


వందమీటర్ల చిరుతలు జమైకాకు చెందిన అసఫా పావెల్, అమెరికాకు చెందిన టైసన్ గే, జమైకాకే చెందిన మహిళా స్ప్రింటర్ షెరాన్ సింప్సన్ డోప్ టెస్టులో విఫలమయ్యారు. వీరు ముగ్గురితో పాటు మరి కొంతమంది క్రీడాకారులు డోపీలుగా దొరికారని యాంటీ డోప్ అసోసియేషన్ తెలిపింది. నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు వారి రక్తపరీక్షల నమూనాల్లో కనిపించినట్టు యాంటీ డోపింగ్ అసోసియేషన్ తెలిపింది. దీనిపై గే, పావెల్ నిర్ఘాంతపోయారు. తామెలాంటి తప్పు చేయలేదని, అయినప్పటికీ ఒలింపిక్ ప్యానల్ తీసుకునే నిర్ణయాన్ని శిరసావహిస్తామని తెలిపారు. తమ శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకం ఎలా దొరికిందో తెలియదు కానీ, అందుకు బాధ్యత వహించాల్సింది మాత్రం తామేనని అన్నారు. భవిష్యత్తుపై ఏం నిర్ణయం వుంటుందో తెలియదు కానీ, పతకాలు వెనక్కి ఇవ్వాలన్నా అందుకు తాము సిద్ధమేనని తెలిపారు.

  • Loading...

More Telugu News