: పూట గడవని స్థితిలో 'ప్రజాప్రతినిధి'


'ప్రజలకు సేవ చేస్తాము' అనే మాటతోనే అందరూ రాజకీయాల్లోకి వస్తారు... అటువంటి వాగ్ధానాలతోనే అందరూ ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ, అతి కొద్ది మంది మాత్రమే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. విశాఖ జిల్లా మునగపాడుకు చెందిన పసగొడుగుల ఈశ్వరయ్య కూడా అటువంటి వారిలో ఓ వ్యక్తి. వ్యాపారం చేసుకునే ఈశ్వరయ్య కొంతకాలం తర్వాత గ్రామానికి సేవ చేద్దామనే సదుద్దేశంతో, ఓ పార్టీ ప్రోద్భలంతో బీసీ కోటా తరపున గ్రామ సర్పంచ్ గా పోటీ చేశాడు. గెలిచి ఐదు సంవత్సరాల పాటు తన గ్రామానికి ఎన్నో సేవలు చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ గ్రామ ప్రజల అవసరాలను తీర్చాడు. నిధులు చాలకపోతే, సొంత డబ్బులు ఖర్చుబెట్టి రోడ్లు, మరుగుదొడ్లు, కల్యాణ మండపం, ఇంకా పలు మౌలిక సదుపాయాలు కల్పించాడు.

ఇది నచ్చని పార్టీ నాయకులు అతని పేరుపై డబ్బులు గుంజి లక్షలకు లక్షలు మింగేవారు. చెప్పినట్లు వినకపోతే సహకరించబోమని బెదిరించే వారు. చేసేదిలేక వారు చెప్పినట్లే ఈశ్వరయ్య వినేవాడు. అయినా ఏనాడు ఎక్కడా చిల్లిగవ్వ అవినీతికి పాల్పడలేదు. అలా చివరికి తన దగ్గర ఏమీ ఉంచుకోక, సంపాదించుకోక అప్పుల పాలయ్యాడు. 2006లో పదవీకాలం పూర్తయ్యే సమయానికి ఈశ్వరయ్య సంపాదించుకున్నది మంచి పేరు, ఇంటి చుట్టూ అప్పులు. దాంతో, ఇప్పుడు పూట గడవని స్థితిలో ఉన్నాడీ మాజీ సర్పంచ్. ఇంటిని పోషించుకోవడం కోసం మాంసం కొట్టు పెట్టుకుని బతుకీడుస్తున్నాడు. భార్య కూలీ పనులకు వెళుతోంది. ఇదీ ఆయన తాజా జీవితం.. నిజాయతీకి ప్రతిఫలం!

  • Loading...

More Telugu News