: ప్రధానితో చిదంబరం భేటీ


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో చిదంబరం ఈ రోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తదితరులతో కలిసి చిదంబరం అమెరికాలో నాలుగు రోజుల పాటు పర్యటించి వచ్చిన తర్వాత ప్రధానితో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా పర్యటన విశేషాల గురించి ఈ సందర్భంగా చిదంబరం ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డాలర్ మారకంలో రూపాయి పతనాన్ని ఆపే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. చిదంబరం ఆర్ బీఐ గవర్నర్ తోనూ సమావేశం అవనున్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News