: 'గబ్బర్ సింగ్' నిర్మాతపై హెచ్చార్సీలో ఫిర్యాదు
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న బండ్ల గణేష్ పై మానవ హక్కుల కమిషన్ లో ఈ రోజు ఫిర్యాదు నమోదైంది. షాద్ నగర్ గ్రామంలో గణేశ్ కు సంబంధించిన పరమేశ్వర పౌల్ట్రీలో ఓ బాలికపై అత్యాచారం జరిగిందని, దీనిపై బండ్ల గణేష్ పై చర్యలు తీసుకోవాలని ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. పరమేశ్వర ఆర్ట్స్ పేరుతో ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన గణేష్, కొన్ని సంవత్సరాల నుంచి వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. అనతికాలంలోనే అగ్రశ్రేణి నిర్మాతల సరసన ఆయన చేరారు.