: ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలకు దమ్ముందా?: హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు సవాల్ విసిరారు. సహకార సంఘాల ఎన్నికల్లో విజయం సాధించామని గొప్పలు పోతున్న ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నికల్లో తమ సత్తా ఎంతో తెలుస్తుందని హరీష్ అన్నారు. మరోవైపు తెలంగాణపై కేంద్రప్రభుత్వానికి టీడీపీ లేఖ రాసింది నిజమే అయితే, సడక్ బంద్ కు ఆ పార్టీ ఎందుకు మద్దతివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.