: నెల్లూరు లాడ్జిలో 3.8 కిలోల బంగారం స్వాధీనం


నెల్లూరులో కొందరు పసిడి వ్యాపారులు అక్రమ బంగారం దందా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న హౌరా మెయిల్ లో ఇలాగే అక్రమ రవాణా జరుగుతున్న 35 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా, తాజాగా స్థానిక ఆర్ ఆర్ లాడ్జిలో సంజయ్ అనే వ్యాపారి నుంచి ఈ ఉదయం పోలీసులు 3.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని పోలీసు స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి విక్రయించేందుకు తీసుకువచ్చారు? అనే కోణాల్లో పోలీసులు సమాచారం రాబడుతున్నారు. ఏది ఏమైనా, నెల్లూరులో కేజీలకు కేజీల బంగారం స్మగ్లింగ్ సంచలనం రేపుతోంది.

  • Loading...

More Telugu News