: కామాతురాణాం...!?
కామంతో కళ్లు మూసుకుపోతే పసిబిడ్డకు, ముసలి వగ్గుకు కూడా తేడా తెలియకుండా అత్యాచారానికి ఒడిగట్టే దుర్మార్గులను గురించి మనం రోజూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం. అయితే మనిషికి, పశువుకి కూడా తేడా తెలియకుండా తన కామ వాంఛ తీర్చుకునేవాడిని ఏమంటాం...? అచ్చు అలాగే ఒక గేదెపై తన కామ వాంఛ తీర్చుకునేందుకు ఒకడు తెగబడ్డాడు. దీంతో సదరు గేదె యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చూడగా చూడగా కొన్ని రోజులకు పశువులను, చివరికి కుక్కలను కూడా కామాంధులు వదిలేలా లేరు. మన పెంపుడు జంతువులకు కూడా మనం రోజూ రక్షణ కల్పించుకోవాల్సి వస్తుందేమో...!
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన లచ్చయ్య ఒక గేదెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం గురించి సదరు గేదె యజమాని బి.బాలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున లచ్చయ్య తన గేదెపై ఇలాంటి అకృత్యానికి పాల్పడుతుండగా తాను గమనించానని పోలీసులకు చెప్పాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.