: శ్రీశాంత్ కు జోడీగా అసీన్ నటించడంలేదట!


కేరళ క్రికెటర్ శ్రీశాంత్ కథానాయకుడిగా నిర్మితమవుతున్న మలయాళ చిత్రం 'బిగ్ పిక్చర్'లో అసిన్ నటిస్తున్నట్టు వచ్చిన వార్తలను దర్శకుడు బాలచంద్రకుమార్ ఖండించాడు. ఏ హీరోయిన్ నూ ఎంపిక చేయలేదని స్పష్టం చేశాడు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ తో పాటు ఓ బాలీవుడ్ స్టార్ నూ నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను కేరళ, దుబాయ్, లండన్ లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీశాంత్ పై స్పాట్ ఫిక్సింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ సినిమా శ్రీశాంత్ జీవితాన్ని ప్రతిబింబించేది కాదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News